Connect with me ...

Thursday, June 03, 2010

బాలానందలహరి 

 య'మహానగరి' కలకత్తా పురి 


జూలై  కల్లా కోల్కతా మొత్తం జలమయం. Airport నించి హోటల్ చేరే వరకు సాగిన పయనం ఓ మధురానుభూతి.
నాయని కృష్ణకుమారి వర్ణించినట్టు (కాశ్మీరు యాత్ర లో) కారుమబ్బులు ఆనందభాష్పములు రాల్చగా వచ్చు ధరిత్రి వెదజిల్లు పరిమళమును మరకత వర్ణం ధరించిన వృక్షములకు అందించి ఆ పిమ్మట  పలకరించవచ్చు ఆ  గాలి స్పర్స అమూల్యం. పెట్ట, బేడా, మూట, ముల్లా, శరీరం, ఆ కూడా వచ్చిన చెత్త, బురద కారు లో పడేసి రయ్! రయ్! అంటూ ఊరు మీదకి  పడ్డాము.      
రోడ్డు , ఆ ఫై నడిచే మనుషులు, వారి వేషాలు, బళ్ళు, రాబళ్ళు, చుట్టూ ఉన్న వనాలు, భవనాలు, ఆచి తూచి కనిపించే రిక్షవాళ్ళు,  కరెంటు స్తంభాలు అన్ని క్రీస్తు పూర్వమే మరి!
నాన్న సెల్ ఫోన్ లో మాట్లాడడం లో , నేను ఇలా ఏదో విన్తాలోచనల్లో మునిగిపోయాము. 
ఇంతలో "ధడాన్" అంటూ దడ పెట్టడం తో కారు మూగబోయింది. కారు దిగిన మరుక్షణం కళ్ళజోడు  మసగ కప్పింది. అమ్మ ఎప్పుడు చెప్పేది అక్షర సత్యం .తీర ప్రాంతాలలో తేమ ఎక్కువ. సాల్ట్ లకే సిటీ అనే ప్రాంతం కోల్కతా లో కల్లా అతి శుభ్రమైన ప్రదేశం. ఇంతకీ ఆ రెండురోజులకి మా బస  అక్కడే!!
హోటల్ రూం లో కాసేపు కునుకు తీసేసరికి సంధ్యాసమయం ఇయింది. Curtain లాగి కిటికీ వైపు చూసేసరికి బయట వాన చేస్తున్న కలకలం మా కడుపుల్లో కూడా చేసింది. క్రింద restaurant కి వెళ్లి బాబు వేడి వేడి గా బజ్జీలో, బొండాలో తెచిపెట్టుకో, తినిపెడతాం అంటే  "నొహి హొయ్" అన్నాడు అన్నింటికీనున్నూ ఆ బెంగాలి బాబు.
కూసంత  టీ తో సరిపెట్టుకొని కోల్కతా విశేషాలు కోసం అన్వేషణ మొదలుపెట్టాము. 
విక్టోరియా హౌస్, హుగ్లీ నది, కామాక్ స్ట్రీట్, బొడ (అంటే బడా అని) బజార్, బైపాస్ రోడ్, హౌరా వారధి, కాకుర్గాచి, అంటూ తిరిగి తిరిగి సిటీ సెంటర్ చేరాము. ఔనన్డోయ్ చెప్పడం మార్చాను; సిటీ సెంటర్ అనే ప్రముఖ కట్టడం సిటీ శివార్లలో ఉంది. ఇది ఒక నేలవారు కట్టడము. మాలు లో రుమాలు గాత్ర దొరుకుతాయి అని తెలుసుకొని వేడి వేడి గా footpath మీద చాట్ ( నాన్న చెత్త అంటారు) లాగించేశా!!!
ఊరుని, తిన్న తిండిని జీర్ణం చేసుకున్న తరువాత ఆలోచించగా ఒక విషయం తెగ నచ్చేసిందండోయ్ 
ఇక్కడ జట్కా బండి దెగ్గర నించి జర్మన్ మేడ్ వరకు అన్ని రకాల వాహనాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి.
మచ్చుకకు ఇవిగో ఇవి ఇక్కడ వీర విహారం చేసేవి 
రిక్షా, ఆటో రిక్షా 
సైకిలు, మోటారు సైకిలు
ట్రైను (మెట్రో), ట్రాము
చిన్న బస్సు, మామూలు బస్సు, పెద్ద బస్సు, మంచి బస్సు
పడవ, ఫెర్రీ 
టాక్సీ , షటిల్  బళ్ళు  మినహాయించ గా ఊరికే తిరిగే ఊరి బండ్లు. 





అటు తుళ్లిన్చే రాయల్ అలీపూర్ పరిసరాలు ఒక వైపు, 
మైళ్లు విస్తరించిన బస్తీలు (slum) అదో టైపు,    
చరిత్ర చాటి చెప్పే బ్రిటిష్ భవనాలు,
IT కంపనీలు కప్పేశాయి గగనాలు,
దక్షినేశ్వర  కాళి  పట్టణానికి మూలదైవం,
 కలలతో మోగించింది శంఖారావం
వానలతో వెలసిబోయాయి కొన్ని కట్టడాలు
లాల్చీలు ,  లూసు జుబ్బాలు ఇవి వీరి కట్టడాలు
పట్టభద్రుడి గా కనిపిస్తాడు ప్రతి బెంగాలి బాబు
పోయేవు దెగ్గరకి చేస్తాడు మరి రుబాబు
(య)మహానగరి ఈ కలకత్తా పురి
తూర్పు భారతమంతకి ఇదీ ఊపిరి!!